ఏపీ ప్రభుత్వం వైయస్సార్ పెన్షన్ కానుక కి సంబంధించి ఈనెల కి సంబంధించిన అప్డేట్ ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ వైయస్సార్ పెన్షన్ కానుక కి సంబంధించిన అప్డేట్ ఏ విధంగా ఉంది మరియు దీన్ని ఏవిధంగా వాడుకోవాలి అలాగే ఈ నెల పెన్షన్ కు సంబంధించి ఎవరైతే ఇంకా తీసుకోలేదో వారికి అప్డేట్ వచ్చింది ఆ విషయాలను తెలుసుకుందాం.
మనకు వైయస్సార్ పెన్షన్ కానుక కి సంబంధించి ప్రతి నెల 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు మీ గ్రామ వార్డు వాలంటీర్ ద్వారా పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ ఒకటో తేదీ నుంచి 5వ తేదీ లోపు ఎవరికైతే పెన్షన్ పంపిణీ చేయలేదో వారికి సంబంధించి ఆరో తేదీ నుంచి తొమ్మిదో తేదీ లోపల ఎందుకు పెన్షన్ అందజేయలేదో తప్పనిసరిగా గ్రామ వాలంటీర్లు వారి మొబైల్ యాప్ లో అప్డేట్ చేయవలసి ఉంటుంది.
Volunteer App – Select Remark in case Unable to Provided Pension to Beneficiary
వారికి సంబంధించిన బయోమెట్రిక్ సరిగా లేకపోవడం వల్ల గాని లేదా వ్యక్తి మరణించి ఉన్నాగాని లేదా హౌస్ డోర్ లాక్ ఉన్నాగాని, ప్రస్తుతం వారు ఏదైనా పరిస్థితులవల్ల హాస్పిటల్ లో ఉన్నా, ప్రస్తుతం వారు అవుట్ ఆఫ్ స్టేట్ లో ఉన్నా లేదా ప్రస్తుతం లబ్ధిదారులు వేరొక ప్రాంతానికి వలస వెళ్ళినా, ఇటువంటి ఆప్షన్ల ద్వారా వారికి సంబంధించిన వివరాలు అనేది అప్డేట్ చేసిన తర్వాత లబ్ధిదారునికి ఇవ్వవలసిన పెన్షన్ అనేది ప్రభుత్వానికి తిరిగి వెనుకకు ఇవ్వబడుతుంది.
వైయస్సార్ పెన్షన్ కానుక కి అర్హత కలిగి ఉండి కూడా పై కారణాల వల్ల పెన్షన్ లబ్ది పొందలేకపోతున్న వారికోసం గ్రామ వాలంటీర్లకు ఇచ్చిన యాప్ లో తప్పనిసరిగా ప్రతి ఒక్క లబ్ధిదారునికి సంబంధించి అప్డేట్ ఆప్షన్ ని అయితే తీసుకురావడం జరిగింది.
ప్రతి నెలా ఈ యొక్క అప్డేట్ ఆప్షన్ ని ఎలా వాడుకోవాలి అంటే ప్రస్తుతం ఎవరైనా పెన్షన్దారులు అంటే పెన్షన్ తీసుకుంటున్నారు కొన్ని నెలలు వేరే ప్రాంతం వెళ్ళినట్లయితే ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం మీ గ్రామంలో పెన్షన్ తీసుకుంటున్న మాదిరిగానే ఒకటో తేదీ నుండి 5వ తేదీ లోపల అక్కడే మీరు పెన్షన్ తీసుకునే అవకాశం ఉంది.
ఒకవేళ మీరు వేరొక ప్రాంతానికి ఒక నాలుగు లేదా ఐదు నెలలు వలస వెళ్ళినట్లయితే అంటే ప్రస్తుతం ఉన్న ఊరు నుండి వేరొక మండలం లేదా వేరొక జిల్లా అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్లయితే ఇటువంటి పరిస్థితుల్లో మీరు వేరొక అంటే మీకు దగ్గర్లోని గ్రామ వార్డు సచివాలయం లో పెన్షన్ డబ్బులు తీసుకునే అవకాశం ఉంది అది ఎలానో చూద్దాం
అటువంటి వారందరికీ ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ లోపు మీ సొంత ఊరు వచ్చి డబ్బులు తీసుకొని వెళ్లకుండా, అప్డేట్ ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది.
మీరు మీ ప్రస్తుత వాలంటీర్ దగ్గర అప్డేట్ ఆప్షన్ చేపించుకోవాలి. ఈ అప్ డేట్ లో మీరు ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ద్వారా, మీకు ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారు అక్కడ సచివాలయం డీటెయిల్స్ ఎంటర్ చేయడం ద్వారా రాబోయే ఐదు నెలలు మీరు ఎప్పటిలాగే మీ సొంత ఊర్లో మాదిరిగానే మీరు ఉంటున్న దగ్గర కూడా పెన్షన్ పొందవచ్చు
గమనిక : మీరు మరలా తిరిగి మీ గ్రామం చేరినప్పుడు మల్ల మీరు మీ పెన్షన్ ట్రాన్స్ఫర్ ని అప్లై చేసుకోవాలి
ఈ బదిలీ ఆప్షన్ ద్వారా ప్రస్తుతం మీరు ఎక్కడికి అయితే వెళ్లి ఉంటారో అక్కడే మీరు ప్రతి నెల ఒకటో తేదీ పెన్షన్ పొందవచ్చు
ఈ పెన్షన్ ట్రాన్స్ ఫర్ ద్వారా మీ పెన్షన్ కార్డు అనేది ఒక చోట నుండి మరొక చోటికి బదిలీ చేయబడుతుంది. అవసరం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ వాడుకోవచ్చు. ఈ ప్రక్రియ మొత్తం నేను గ్రామ వార్డు వాలంటీర్ ద్వారా చేయబడుతుంది దయచేసి వాడుకోగలరు.
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.
Leave a Reply