ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ఖాతా(PMJDY) ఉన్న చాలా మంది అకౌంట్ ను క్లోజ్ చేసుకుంటున్నారు. దీని వల్ల రూ.2.30 లక్షల వరకు నష్టపోయే అవకాశం ఉంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
దేశంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ బ్యాంక్ ఖాతా ఉండాలన్న ఉద్దేశ్యంతో ఎలాంటి మినిమమ్ డిపాజిట్ లేకుండా జీరో అకౌంట్ ను ఓపెన్ చేసుకోవచ్చని జన్ ధన్ యోజన ఫథకాన్ని కేంద్ర ప్రభుత్వం 15 ఆగస్టు, 2014న ప్రారంభించారు. ఇది 28, ఆగస్టు 2014లో అమలులోకి వచ్చింది. చాలామంది జన్ ధన్ యోజన పథకం కింద ఖాతాలను తెరిచారు.
అయితే జన్ ధన్ ఖాతా ఉన్న బ్యాంక్ లో మరో ఖాతా ఉన్నవాళ్లు కూడా చాలామంది ఉన్నారు. ఒకే బ్యాంక్ లో ఒకే ఆధార్ తో రెండు అకౌంట్స్ ఉంటే.. ఆన్ లైన్ లావాదేవీలు చేయలేరు. యోనో, ఎస్బీఐ వంటి వాటిలో లాగిన్ కు అవకాశం ఉండదు. అందుకే ఇటీవల ఈ జన్ ధన్ ఖాతాలను క్లోజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇలా జన్ ఖాతాను క్లోజ్ చేసుకోవడం వల్ల రూ. 2.30 లక్షల వరకు నష్టపోయే అవకాశం ఉంటుంది. జన్ ధన్ ఖాతా కలిగిన వారికి ఉచితంగానే రూపే డెబిట్ కార్డు అందిస్తారు. ఈ కార్డు పై రూ.2 లక్షల వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ లభిస్తుంది.
ఇందులో భాగంగా వీరికి రూ. 30 వేల వరకు బీమా లభిస్తుంది. అకౌంట్ కలిగిన వారు అకస్మాత్తుగా మరణిస్తే వారి కుటుంబానికి ఈ డబ్బులు లభిస్తాయి. ఆధార్ కార్డు లింక్ చేసుకోని వాళ్ళు ఈ ప్రయోజనాలను పొందలేరు. ఇప్పటివరకు జన్ ధన్ ఖాతా ఓపెన్ చేయకపోతే మొదట సమీప బ్యాంక్ కు వెళ్లాలి.
జనధన్ ఫారం పూర్తి చేయాలి. అందులో మీ పేరు, మొబైల్ నంబర్, చిరునామా, వ్యాపారం, ఉపాధి, వార్షిక ఆదాయం ఆధారపడిన వారి సంఖ్య, నామిని మొదలైనవి పూరించాలి. దీనికి 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు అర్హులు.
ఆధార్ కార్డు, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ లాంటివి జిరాక్స్ సమర్పించాలి. అకౌంట్ ఓపెన్ కు ఎలాంటి రుసుము వసూలు చేయరు. ఒక వేళ ఖాతాదారుడు ప్రమాదానికి గురయితే క్లయిమ్ కోసం క్లెయిమ్ ఫామ్, డెత్ సర్టిఫికెట్, ప్రమాదం జరిగినట్టు ఎఫ్ఐఆర్, పోస్ట్ మార్టం రిపోర్ట్, ఆధార్ కార్డ్ వివరాలు సబ్మిట్ చేయాలి.
వీటితో పాటు బ్యాంకు నుంచి డిక్లరేషన్ కూడా కావాలి. డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన కొన్ని రోజులకు క్లెయిమ్ సెటిల్ అవుతుంది. ఈ మొత్తం నామినీ కి చెందుతాయి. ఇప్పటికే జన్ ధన్ ఖాతా ఉన్న వాళ్లు కూడా.. ఆధార్ తో లింక్ చేసుకోవాలని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు.
Leave a Reply