ఫిబ్రవరి 24 శుక్రవారం 2023 వ తేదీన పీఎం కిసాన్ మూడో విడత డబ్బులు రైతుల ఖాతాలో జమా
Third installment of PM Kisan will be deposited in farmers’ accounts on Friday, February 24, 2023.
రైతులకు శుభవార్త. త్వరలో వారి బ్యాంకు అకౌంట్లో డబ్బులు జమ కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అర్హత కలిగిన రైతులకు ప్రతి ఏడాది రూ.6 వేలను అందిస్తుంది. వీటిని మూడు విడతలుగా రైతుల అకౌంట్లో జమ చేస్తుంది. ఇప్పటికే 12 విడత డబ్బులు చెల్లించింది. ఇప్పుడు 13వ విడత డబ్బులు త్వరలో రానున్న కొద్ది రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేయనుంది.
PM Kisan Money will be Deposited in The Bank Account In 3 Days
రైతులకు పెట్టుబడి సాయం అందించడానికి కేంద్రం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనే పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా సన్న, చిన్న కారు రైతులకు వారి అకౌంట్లో ప్రతి ఏడాది రూ. 6 వేలను క్రెడిట్ చేస్తుంది. ఈ స్కీమ్ ద్వారా పెట్టుబడిసాయం పొందడానికి పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఈ-కేవైసీ పూర్తి చేయాలి. ఇది పూర్తి చేయకపోతే గనక పీఎం కిసాన్ డబ్బులు అందవు. అలాగే, ఆధార్ కార్డు నెంబర్ బ్యాంక్ అకౌంట్‌తో లింక్ చేసుకోవాలి.
Leave a Reply