ఏపీలోని రైతులకు సీఎం జగన్ (Cm Jagan) సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల 27న పీఎం కిసాన్ రైతుభరోసా నిధులను విడుదల చేయనున్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. ఇక అదే రోజు రైతుభరోసా ఇన్ ఫుట్ సబ్సిడీ నిధులను విడుదల చేయనున్నారు. గుంటూరు జిల్లాలోని తెనాలిలో జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొని ఈ నిధులను విడుదల చేయనున్నారు.
Pm Kisan, Rythubharosa and Input Subsidy Funds to Release on February 27th
ఏపీలోని రైతులకు సీఎం జగన్ (Cm Jagan) సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల 27న పీఎం కిసాన్ రైతుభరోసా నిధులను విడుదల చేయనున్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు.
ఇక అదే రోజు రైతుభరోసా ఇన్ ఫుట్ సబ్సిడీ నిధులను విడుదల చేయనున్నారు. గుంటూరు జిల్లాలోని తెనాలిలో జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొని ఈ నిధులను విడుదల చేయనున్నారు.
మరోవైపు ఈనెల 28 వరకు రబీ ఈ క్రాప్, ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. యాసంగికి సంబంధించి ఏప్రిల్ లో అవకాశం ఇస్తామని అధికారులు చెప్పుకొచ్చారు.
మాండస్ తుఫాన్ ఎఫెక్ట్ తో దెబ్బతిన్న పంటలకు పెట్టుబడి రాయితీగా రూ.76 కోట్లను 27న లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
అలాగే వైఎస్సార్ యంత్రాల గురించి కీలక సూచనలు చేశారు. మార్చి 5 నాటికి వైఎస్సార్ యంత్ర సేవాల కేంద్ర ఏర్పాటుకు బ్యాంకు ఋణం, డీలర్లకు కొనుగోలు ఆర్డర్లు జారీ చేయడం పూర్తి చేయాలనీ సూచించారు.
ఒకేరోజు పీఎం కిసాన్ రైతు భరోసా నిధులు, ఇన్ ఫుట్ సబ్సిడీ నిధుల విడుదల ప్రకటనతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెనాలిలో వ్యవసాయ మార్కెట్ లో సీఎం జగన్ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభ ద్వారా నిధులను బటన్ నొక్కి సీఎం విడుదల చేయనున్నారు.
Leave a Reply