హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవరత్నాలు డాట్ కాం ఈ పేజీ ద్వారా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 13వ విడత ఫండ్ విడుదల గురించి తెలుసుకుందాం. ఈ పేజీ మొత్తం చదివి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే రైతులందరికీ కూడా కీలక ప్రకటన చేసింది, రైతులందరికీ కూడా శుభవార్త అయితే చెప్పింది. ఎప్పటి నుంచో రైతులకు పీఎం కిసాన్ డబ్బులు అయితే పెంచాలని చూస్తున్నారు. ఎట్టకేలకు ఇప్పుడు దీనికి సంబంధించిన సమయం అయితే వచ్చింది. రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పనుంది కేంద్రం ఈ నెల 23న కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల కానున్నాయి పూర్తి వివరాలు కింద చదవండి
PM-KISAN : రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది కేంద్ర సర్కార్. ఈ నెల 23వ తేదీన కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల కానున్నాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యౌజన 13వ విడత డబ్బులు ఈ నెలాఖరులో ఎడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రంలోని బీజేపీ సర్కారు రైతులకోసం ఎన్నో పథకాలను తీసుకొచ్చింది.
దీనిలో భాగంగా 2019లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్ ) పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6,000 చొప్పున.. మూడు వాయిదాలలో రూ.2,000 చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటివరకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 12 వాయిదాల నగదును రైతులకు అందించగా.. ఇప్పుడు 13వ ఎఏడత పీఎం కిసాన్ నగదు కోసం లక్షలాది మంది రైతులు ఎదురుచూస్తున్నారు. జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉండటంతో ఆ రోజు రైతుల ఖాతాల్లో రూ.2000 చొప్పున వేస్తారని సమాచారం.
మరోవైపు రైతులు ఈనెల 15లోగా ఈకేవైసీ పూర్తి చేయాలని, ఆధార్ అనుసంధానం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈకేవైసీ లేకుంటే 13వ విడత డబ్బులు రావని హెచ్చరిస్తున్నారు.
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.
Leave a Reply