PM Kisan 13th Installment | పీఎం కిసాన్ స్కీమ్ రైతులకు ముఖ్యమైన అలర్ట్. మీరు కచ్చితంగా ఇకేవైసీ పూర్తి చేసుకోవాలి. లేదంటే డబ్బులు రావు. ఇలా మీరు ఇకేవైసీ పూర్తి చేసుకోవడానికి ఇంకో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.
పీఎం కిసాన్ స్కీమ్ కింద లబ్ధి పొందుతున్న రైతులు అందరూ కచ్చితంగా ఇకేవైసీ చేసుకోవాలి. దీనికి ఫిబ్రవరి 10 డెడ్‌లైన్‌గా ఉంది. అందువల్ల మీరు ఇంకా ఇకేవైసీ చేసుకోకపోతే వెంటనే ఆ పని పూర్తి చేసుకోండి.
మీరు నేరుగా పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఇకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. లేదంటే దగ్గరిలోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లినా కూడా ఇకేవైసీ పూర్తి చేస్తారు. మీరు పీఎం కిసాన్ వెబ్‌సైట్ ద్వారా ఇకేవైసీ చేసుకోవాలని భావిస్తే.. ఆధార్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉండాలి.
రాజస్థాన్ ప్రభుత్వం ఫిబ్రవరి 10లోపు ఇకేవైసీ చేసుకోవాలని రైతులకు తెలియజేసింది. లేదంటే పీఎం కిసాన్ తర్వాతి విడత డబ్బులు రావని స్పష్టం చేసింది. అందువల్ల మీరు కూడా ఈ గడువు లోగా ఇకేవైసీ పూర్తి చేసుకోవడం ఉత్తమం.
ఎందుకంటే పీఎం కిసాన్ స్కీమ్ అనేది జాతీయ పథకం. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అందిస్తోంది. అందువల్ల అన్ని రాష్ట్రాలకు ఒకటే రూల్స్ వర్తిస్తాయి. అందువల్ల ఇకేవైసీ పూర్తి చేసుకోని వారు ఉంటే మాత్రం ఫిబ్రవరి 10లోగా ఆ పని పూర్తి చేసుకోవడం మంచిది.
కాగా కేంద్ర ప్రభుత్వం వచ్చే విడత డబ్బులను త్వరలోనే రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది. హోలీ పండుగ కన్నా ముందుగానే ఈ డబ్బులు అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమ కావొచ్చని తెలుస్తోంది.
అందువల్ల మీరు ఇంకా ఇకేవైసీ చేసుకోకపోతే మాత్రం వెంటనే త్వరపడండి. అంతేకాకుండా బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ కార్డును లింక్ చేసుకోండి. ఆధార్, బ్యాంక్ ఖాతా లింక్ అయిన వారికే డబ్బులు వస్తాయి.
కాగా ఇప్పటి వరకు చూస్తే కేంద్ర ప్రభుత్వం 12 విడతల డబ్బులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. అంటే రూ. 24 వేలు అందాయి. ఒక్కో రైతుకు ఈ మేర డబ్బులు లభించాయి. ఇప్పుడు తర్వాతి విడత డబ్బులు వస్తే.. ఒక్కొక్కరికి రూ. 26 వేలు వచ్చినట్లు అవుతుంది.
కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని తెచ్చింది. దీని కింద అర్హత కలిగిన వారికి ఏడాదికి రూ. 6 వేలు అందిస్తోంది. ఈ డబ్బులు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రూ. 2 వేల చొప్పున అన్నదాతలకు అందుతున్నాయి.
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.
Leave a Reply