Post Office Blockbuster Scheme | Get Rs. 16 Lakhs, with Rs. 5,000 Savings : PPF | పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్ అందుబాటులో ఉంది. ఇందులో చేరితే ఏకంగా రూ. 16 లక్షలు పొందొచ్చు. ఇంకా ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. రిస్క్ లేకుండా రాబడి వస్తుంది.
PPF SCHEME INVEST RS 5000 PER MONTH GET RS 16 LAKH
Public Provident Fund | మీరు డబ్బులు దాచుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? ప్రతి నెలా కొంత మొత్తం పొదుపు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం అదిరిపోయే ఆఫర్ ఆప్షన్ ఒకటి అందుబాటులో ఉంది. రిస్క్ లేకుండా కచ్చితమైన రాబడి (Money) పొందొచ్చు. ఎలా అంటే పోస్టాఫీస్ (Post Office) స్కీమ్ ద్వారా మీరు ఈ బెనిఫిట్ పొందొచ్చు. అంతేకాకుండా పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా సొంతం చేసుకోవచ్చు. ఇలా రిస్క్ లేకుండా పన్ను పడకుండా అదిరే లాభం పొందొచ్చు. ఇంతకీ అది ఏ స్కీమ్ అని అనుకుంటున్నారా?
అదే పోస్టాఫీస్ పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ పథకం. ఈ స్కీమ్‌లో చేరిన వారికి ప్రస్తుతం 7.1 శాతం వ్డడీ లభిస్తోంది. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు. తర్వాత అవసరం అనుకుంటే ఐదేళ్ల చొప్పున ఈ స్కీమ్ టెన్యూర్ పెంచుకుంటూ వెళ్లొచ్చు. కనీసం ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో రూ. 500 ఇన్వెస్ట్‌మెంట్‌తో ఈ స్కీమ్‌లో చేరొచ్చు. గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం ఆధారంగా మీకు వచ్చే రాబడి ఆధారపడి ఉంటుంది.
ఈ స్కీమ్‌లో చేరడం వల్ల ప్రతి ఏటా ట్యాక్స్ బెనిఫిట్స్ పొందొచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. పెట్టిన డబ్బులు, వచ్చే వడ్డీ, విత్‌డ్రా చేసుకునే మొత్తంపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు. అందుకే బెస్ట్ ట్యాక్స్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్‌లో ఇది కూడా ఒకటని చెప్పుకోవచ్చు.
ఉదాహరణకు మీరు ప్రతి నెలా రూ. 5 వేలు ఇన్వెస్ట్ చేయాలని భావిస్తే.. మీకు మెచ్యూరిటీ సమయంలో ఏకంగా రూ. 16 లక్షలకు పైగా వస్తాయి. అంటే మీరు సంవత్సరానికి రూ. 60 వేలు ఇన్వెస్ట్ చేసినట్లు అవుతుంది. ఇలా 15 ఏళ్లు ఇన్వెస్ట్ చేయాలి. మెచ్యూరిటీ సమయంలో మీకు రూ. 16,27,284 వస్తాయి. మీరు ఈ కాలంలో ఇన్వెస్ట్ చేసిన మొత్తం రూ. 7,27,284 అవుతుంది. దగ్గరిలోని పోస్టాఫీస్‌కు వెళ్లి మీరు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. మీరు ఇంకా ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేస్తే.. వచ్చే రాబడి కూడా పెరుగుతుంది. అలాగే తక్కువ మొత్తం డిపాజిట్ చేస్తే.. తక్కువ రాబడి లభిస్తుంది. నెలకు రూ. 3 కడితే మెచ్యూరిటీ సమయంలో చేతికి దాదాపు రూ. 10 లక్షల వరకు వస్తాయి. ఇలా రాబడి మారుతుంది.
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.
Leave a Reply