MCLR | బ్యాంకులు వరసపెట్టి కస్టమర్లకు ఝలక్ ఇస్తున్నాయి. ఇప్పటికే చాలా బ్యాంకులు కస్టమర్లకు షాకిచ్చాయి. దీంతో చాలా మందిపై ప్రతికూల ప్రభావం పడనుంది.
SBI, UNION BANK, BANK OF BARODA, PNB, IOB, RAISE MCLR BY UP TO 25 BPS
Loan EMI | ఆర్‌బీఐ రెపో రేటు పెంపుతో బ్యాంకులు వరుస పెట్టి కస్టమర్లకు ఝలక్ ఇస్తున్నాయి. ఇప్పటికే చాలా బ్యాంకులు రుణ రేట్లు పెంచేశాయి. రిజర్వు బ్యాంక్ రేటు పెంపు తర్వాత రుణ రేట్ల పెంపు గమనిస్తే.. ఇప్పటి వరకు కేవలం ప్రభుత్వ రంగ బ్యాంకులే రుణ రేట్లు పెంచాయని తెలుస్తోంది.
దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌గా కొనసాగుతూ వస్తున్న ఎస్‌బీఐ రుణ రేట్లను పెంచేసింది. ఫిబ్రవరి 15 నుంచి రుణ రేట్ల పెంపు అమలులోకి వచ్చింది. ఈ బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను 10 బేసిస్ పాయింట్లు పెంచేసింది.
ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ 7.95 శాతానికి చేరింది. నెల రోజుల ఎంసీఎల్ఆర్, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 8.1 శాతానికి పెరిగింది. ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 8.5 శాతానికి చేరింది. రెండేళ్ల ఎంసీఎల్ఆర్ 8.6 శాతానికి, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ 8.7 శాతానికి పెరిగాయి.
ప్రభుత్వ రంగానికి చెందిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎంసీఎల్ఆర్ రేటు పెంచింది. 25 బేసిస్ పాయింట్ల మేర రేటు పెరిగింది. ఫిబ్రవరి 11 నుంచి ఈ రేటు అమలులోకి వచ్చింది. దీంతో బ్యాంక్ ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 8.65 శాతానికి చేరింది.
అలాగే మరో బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ఎంసీఎల్ఆర్ రేటు పెంచేసింది. ఈ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేటు 5 బేసిస్ పాయింట్లు పెరిగిందని చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి 12 నుంచి ఈ రేటు పెంపు అమలులోకి వచ్చింది. ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 8.55 శాతానికి ఎగసింది.
ఇంకా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కూడా రుణ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేటును 15 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. దీంతో ఈ బ్యాంక్ ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 8.45 శాతానికి ఎగసింది.
అలాగే యూకో బ్యాంక్ కూడా ఎంసీఎల్ఆర్ రేటును పెంచేసింది. ఇంకా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా రుణ రేట్లు పెంచేసింది. అలాగే మరో ప్రభుత్వ రంగ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా రుణ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది.
బ్యాంకులు రుణ రేట్లు పెంచడం వల్ల రుణ గ్రహీతలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇప్పటికే లోన్ తీసుకొని ఉంటే నెలవారీ ఈఎంఐలు పైకి చేరుతాయి. అదే కొత్తగా లోన్ పొందాలంటే అధిక వడ్డీ రేటు చెల్లించుకోవాలి.
ఆర్‌బీఐ ఈ నెలలో జరిగి పాలసీ సమీక్షలో రెపు రేటును పావు శాతం మేర పెంచేసింది. దీంతో రెపో రేటు 6.5 శాతానికి చేరింది. గత ఏడాది మే నెల నుంచి రెపో రేటు 250 బేసిస్ పాయింట్ల మేర పైకి కదిలిందని చెప్పుకోవచ్చు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
Leave a Reply