సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సాహించడం, స్వయం ఉపాధి పొందాలనుకునేవారి కోసం కేంద్ర ప్రభుత్వం ముద్ర లోన్లు అందిస్తోన్న సంగతి తెలిసిందే. దీని ద్వారా సుమారు 10 లక్షల రూపాయల వరకు లోన్ ఇస్తుంది.
SBI Offers Rs 10 Lakh in e-Mudra Loan Full Details Here | How to Apply for It ?
జాబ్ చేసే ఆలోచన లేదు.. సొంత ఊరిని విడిచి దూరంగా పట్నం వెళ్లాలంటే మనసు రావడం లేదు. కానీ ఊరిలో ఉపాధి మార్గాలు తక్కువ.. పోనీ ఏదైనా వ్యాపారం చేద్దామా అంటే.. కనీసం లక్ష రూపాయాలైనా పెట్టుబడి పెట్టాలి.. కానీ అంత మొత్తం చేతిలో లేదు… ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా.. అయితే మీలాంటి వాళ్ల కోసమే భారతీయ స్టేట్ బ్యాంక్ ఓ బంపరాఫర్ ప్రకటించింది. వ్యాపారం చేయాలనే ఆలోచన ఉండి.. తగిన సొమ్ము లేక బాధపడుతున్న వారి కోసం ఓ బంపరాఫర్ ప్రకటించింది. సుమారు 10 లక్షల రూపాయల వరకు లోన్ ఇచ్చేందుకు రెడీగా ఉంది ఎస్‌బీఐ. ఇంతకు ఈ లోన్ పొండానికి అర్హతలు ఏంటి.. ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి.. తదితర పూర్తి వివరాలు ఇక్కడ..
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సాహించడం, స్వయం ఉపాధి పొందాలనుకునేవారి కోసం కేంద్ర ప్రభుత్వం ముద్ర లోన్లు అందిస్తోన్న సంగతి తెలిసిందే. దీని ద్వారా సుమారు 10 లక్షల రూపాయల వరకు లోన్ ఇస్తుంది. కాగా దేశంలోనే అతి పెద్ద బ్యాంక్‌గా గుర్తింపు పొందిన భారతీయ స్టేట్ బ్యాక్ కూడా.. ముద్ర యోజన కింద వ్యాపారం చేయాలనుకునేవారికి బిజినెస్, వర్కింగ్ కాపిటల్ లోన్స్ అందిస్తుంది. ముద్ర యోజన కింద ఎస్‌బీఐ 50 వేల నుంచి 10 లక్షల రూపాయల వరకు లోన్ ఇస్తుంది. ఐదేళ్లలోపు తిరిగి చెల్లించే అవకాశం కల్పిస్తుంది.
ఎవరు అర్హులంటే..
ఒక్కరే సొంతంగా వ్యాపారం చేయాలనుకువారికి, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రలు స్థాపించాలనుకునేవారికి, తయారీ, ట్రేడింగ్ రంగాల్లో వ్యాపారం చేయాలనుకునేవారు ఎస్‌బీఐ ముద్ర, ఇ-ముద్ర లోన్స్ అందుబాటులో ఉన్నాయి. ఎస్‌బీఐ సేవింగ్స్, కరెంట్ అకౌంట్స్ ఉన్నవారు ఈ ఎస్‌బీఐ ముద్ర లోన్స్‌కు అర్హులు. మరి ఎస్‌బీఐ ఇ ముద్ర యోజనకు ఎలా అప్లై చేసుకోవాలో పూర్తి వివరాలు..
ఏమేం డాక్యుమెంట్స్ కావాలంటే..
- పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో జత చేసి.. అప్లికేషన్ ఫామ్‌ని పూర్తి చేయాలి.
- అప్లికేషన్‌తో పాటు కేవైసీ డాక్యుమెంట్స్ అనగా పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ కార్డ్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ వంటి వాటిని సమర్పించాలి.
- సేవింగ్స్, కరెంట్ అకౌంట్ నంబర్స్, బ్రాంచ్ వివరాలు తెలపాలి.
- బిజినెస్ వాలిడేషన్ వివరాలు అంటే పేరు, ఎప్పుడు ప్రారంభం అయ్యింది, అడ్రెస్ వంటివి.
- ఆధార్ నంబర్(తప్పకుండా బ్యాంక్ ఖాతాకు అప్‌డేట్ అయి ఉండాలి)
- కులానికి సంబంధించిన వివరాలు..
- జీఎస్‌టీఎన్, ఉద్యోగ్ ఆధార్ నంబర్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
- షాపు నెలకొల్పినట్లు నిరూపించే డాక్యుమెంట్స్, బిజినెస్ రిజిస్ట్రేషన్ వివరాలు అవసరం ఉండొచ్చు.
అర్హత ప్రక్రియ..
దరఖాస్తుదారు తప్పనిసరిగా తయారీ లేదా సేవా రంగం వంటి వ్యవసాయేతర ఆదాయం పొందే రంగంలో పని చేయాలి.
దరఖాస్తుదారు కనీసం రెండేళ్లపాటు ఒకే స్థలంలో నివసించి ఉండాలి.
ఎస్‌బీఐ ఇ-ముద్ర లోన్‌కు ఎలా దరఖాస్తు చేయాలంటే..
ప్రస్తుతం ఎస్‌బీఐలో కరెంట్, సేవింగ్స్ అకౌంట్ ఉన్నవాళ్లు.. 10 లక్షల రూపాయల వరకు ఇ-ముద్ర లోన్‌కు అప్లై చేసుకోవచ్చు.
ముందుగా ఎస్‌బీఐ ఇ-ముద్ర పోర్టల్‌ని సందర్శించాలి.
ఇందుకు గాను ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
తర్వాత ప్రొసీడ్ బట్‌ను ప్రెస్ చేయాలి.
ఓటీపీ అథెంటికేషన్ ద్వారా లోన్ ప్రాసెసింగ్, పంపిణీ కోసం ఇ-కేవైసీ, ఇ-సైన్ తప్పనిసరిగా పూర్తి చేయాలి. కాబట్టి, ఆధార్ కార్డ్ వివరాలను తప్పనిసరిగా అందించాలి.
ఎస్‌బీఐ ఫార్మాలిటీలు, లోన్ ప్రాసెస్‌ని పూర్తి చేసిన తర్వాత, దరఖాస్తుదారు తప్పనిసరిగా ఇ-ముద్ర పోర్టల్‌కి తిరిగి రావాలని వారికి మెసేజ్ పంపుతారు.
తర్వాత లోన్ ఆమోదాన్ని నిర్ధారిస్తూ మెసేజ్ వచ్చిన 30 రోజులలోపు లోన్ అప్రూవల్ పూర్తి అవుతుంది.
Leave a Reply