SBI Server Down: అక్టోబర్ 14న భారత అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ SBI ఆన్‌లైన్ సేవలన్నీ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. నెట్ బ్యాంకింగ్, యూపీఐ, యోనో యాప్ ఇలా ఏదీ పనిచేయలేదు. దీంతో కస్టమర్లు SBI పై విమర్శల వర్షం కురిపించారు. తాజాగా దీనిపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివరణ ఇచ్చింది. ఈ ఒక్కసారికి క్షమించాలని చెప్పింది.
SBI Server Down Why State Bank Of India Net Banking UPI Were Down Yesterday Bank Clarifies
SBI Server Down: భారత దేశంలోని అతిపెద్ద బ్యాంక్ .. భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) డిజిటల్ సర్వీసులు 2023, అక్టోబర్ 14న నిలిచిపోయిన సంగతి తెలిసిందే. పలువురు ఎస్‌బీఐ కస్టమర్లు ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఎస్‌బీఐ యూపీఐ సేవలు, నెట్ బ్యాంకింగ్ ఇంకా SBI డిజిటల్ బ్యాంకింగ్ సర్వీస్ యోనో యాప్ ఇలా ఏదీ పనిచేయట్లేదని ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల్లో కంప్లైంట్స్ చేశారు. సోమవారం రోజు చాలా వరకు ఎస్‌బీఐ సేవలేం అందుబాటులోకి రాలేదు. అయితే ఈ విషయంపై క్రితం రోజు ఏం స్పందించని ఈ దిగ్గజ బ్యాంక్.. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చింది. సేవలు ఎందుకు పనిచేయలేదో కస్టమర్లకు వివరించే ప్రయత్నం చేసింది. అందుకు క్షమించాలని కోరింది.
సాంకేతిక లోపం కారణంగానే అక్టోబర్ 14న ఎస్‌బీఐ ఆన్‌లైన్ సేవలకు అంతరాయం ఏర్పడిందని ఒక ప్రకటనలో చెప్పుకొచ్చింది స్టేట్ బ్యాంక్. ఇప్పుడు ఆ సమస్య పరిష్కారం అయిందని, సేవలన్నీ మళ్లీ యథాతథంగా పనిచేస్తున్నాయని వివరించింది. కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు.. అందుకు క్షమించాలని అభ్యర్థించింది. ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా.. అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు హామీ ఇచ్చింది.
”సాంకేతిక లోపం వల్ల అక్టోబర్ 14న ఎస్‌బీఐ డిజిటల్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఇప్పుడు అది పరిష్కారమైంది. అలా జరిగినందుకు మేం క్షమాపణలు కోరుతున్నాం. భవిష్యత్తులో ఈ సమస్య పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కస్టమర్లకు ఎల్లప్పుడూ మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతోనే బ్యాంక్ పనిచేస్తుంది. మీరు ఓపికతో ఉన్నందుకు.. ఎస్‌బీఐపై నమ్మకం ఉంచుతున్నందుకు కృతజ్ఞతలు.” అని ఎస్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ రోజు అంటే అక్టోబర్ 13న ఈ సమస్య మరింత తీవ్రమైంది. దేశవ్యాప్తంగా ఈ డిజిటల్ సేవలు స్తంభించిపోయాయి. కనీసం ఎస్‌బీఐ అకౌంట్‌లో బ్యాలెన్స్ చూసుకోవాలన్నా కస్టమర్లు ఇబ్బందులు పడ్డారు. సాంకేతిక సమస్య కారణంగా ఆ సర్వీసులు పనిచేయట్లేదని చూపించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా సర్వీసుల అంతరాయానికి గల కారణాన్ని వివరించి.. కస్టమర్ల నుంచి క్షమాపణ కోరింది.
Leave a Reply