బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి సీనియర్ సిటిజన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పారు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) డిపాజిట్ లిమిట్‌ను రూ.30 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో వివిధ బ్యాంకులు టర్మ్ డిపాజిట్లపై అధిక రేట్లను ఆఫర్ చేస్తూ సీనియర్ సిటిజన్స్‌ను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాయి.
FD Rates Hike Lucky Chance For Senior Citizens With Increase In SCSS Limit Banks Hiked FD Rates Know Details Here
ఇటీవల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్-2023ను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి సీనియర్ సిటిజన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పారు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) డిపాజిట్ లిమిట్‌ను రూ.30 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.
దీంతో వివిధ బ్యాంకులు టర్మ్ డిపాజిట్లపై అధిక రేట్లను ఆఫర్ చేస్తూ సీనియర్ సిటిజన్స్‌ను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆర్బీఐ కీలక రెపో రేటును వరుసగా పెంచుతుండడం కూడా బ్యాంకులకు కలిసి వస్తోంది. బడ్జెట్ అనంతరం సీనియర్ సిటిజన్స్ కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకుల వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..
ఈ బ్యాంక్ సీనియర్ సిటిజన్స్‌ను ఆకర్షించేలా వివిధ కాలపరిమితి ఎఫ్ డీలపై వడ్డీరేట్‌ను పెంచింది. 1-2 ఏళ్ల కాలపరిమితి తో కూడిన రూ. 2 కోట్ల కంటే తక్కువ నాన్-కాలబుల్ డిపాజిట్లపై తాజాగా 7.25% వడ్డీని ఆఫర్ చేస్తోంది. 444 రోజుల స్పెషల్ కాలబుల్ డిపాజిట్‌పై 7.85%, నాన్ – కాలబుల్ డిపాజిట్లపై 8.1% వడ్డీని సీనియర్ సిటిజన్స్ కోసం తాజాగా ఆఫర్ చేస్తోంది. తాజా వడ్డీ రేట్లు ఫిబ్రవరి 10 నుంచి అమల్లోకి వచ్చాయి.
* ఎస్‌బీఐ
దిగ్గజ ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్‌బీఐ సీనియర్ సిటిజన్స్ కోసం కొత్త ఎఫ్‌డీ పథకాన్ని ప్రకటించింది. ఎస్‌బీఐ అమృత కలాష్ పేరుతో కొత్త కాలపరిమితి డిపాజిట్ స్కీమ్‌ను తీసుకొచ్చింది. 400 రోజుల కాలపరిమితితో కూడిన ఈ డిపాజిట్ ద్వారా సీనియర్ సిటిజన్స్ 7.6శాతం వడ్డీని పొందనున్నారు.
* యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ..
ఈ బ్యాంక్ సీనియర్ సిటిజన్స్‌కు 1001రోజుల డిపాజిట్లపై 9.5% వరకు వడ్డీని తాజాగా ఆఫర్ చేస్తోంది. 501 రోజులు, 181-201 రోజుల కాలపరిమితి ఎఫ్‌డీలపై 9.25% వడ్డీని అందిస్తోంది.
* జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సైతం సీనియర్ సిటిజన్స్ కోసం ఎంపిక చేసిన కొన్ని ఎఫ్‌డీలపై వడ్డీ రేటును పెంచింది. 2-3 ఏళ్ల కాలపరిమితి ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై సీనియర్ సిటిజన్స్‌కు తాజాగా 8.8% వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఇక, 3-5 ఏళ్ల టెన్యూర్ డిపాజిట్లపై 8.05%, 1-2 సంవత్సరాల డిపాజిట్లపై 8.2% వడ్డీని తాజాగా అందిస్తోంది.
బంధన్ బ్యాంక్ ..
ఈ బ్యాంక్ తాజాగా సీనియర్ సిటిజన్స్ కోసం ఎంపిక చేసిన వివిధ కాలపరిమితి ఎఫ్‌డీలపై వడ్డీరేటును పెంచింది. 600 రోజుల డిపాజిట్ పై సీనియర్ సిటిజన్స్‌కు తాజాగా 8.5% వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది. 3-5 సంవత్సరాల కాలపరిమితి డిపాజిట్లపై 7.5% వడ్డీని అందిస్తోంది.
ఏది బెటర్ అంటే?
కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ద్వారా సీనియర్ సిటిజన్స్‌కు అనేక ప్రయోజనాలను కల్పించింది. దీంతో ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోల్చితే ఇది మరింత మెరుగైంది. ప్రస్తుతం, ఎస్‌సీఎస్‌ఎస్ వడ్డీ రేటు 8%గా ఉంది. అంతేకాకుండా, SCSS ఖాతా పెట్టుబడులకు గ్యారెంటీ ఉంటుంది. అదే FD విషయంలో కేవలం రూ.5 లక్షల వరకు మాత్రమే హామీ ఉంటుంది. SCSSలో పెట్టుబడికి ఆదాయ పన్ను సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలు సైతం ఉంటాయి.
Leave a Reply