YSR Kalyanamastu… Shaadi Tofa is a big help for marriage
పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు సర్కారు సాయం..
4,536 కుటుంబాలకు రూ.38.18 కోట్లు
ప్రతి మూడు నెలలకు ఒకసారి దరఖాస్తుల పరిశీలన
కల్యాణమస్తు, షాదీ తోఫా ఆర్థిక సాయం భారీగా పెంపు
ఈ నెల 10వ తేదీన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు భవన నిర్మాణ కార్మికులు, విభిన్న ప్రతిభావంతుల్లో దరఖాస్తు చేసుకున్న 4,536 కుటుంబాలకు ఆర్థిక సాయం కింద రూ.38.18 కోట్లు పంపిణీ చేయనుంది.
గతంతో పోలిస్తే సాయం మొత్తాన్ని భారీగా పెంచింది.
కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాల కోసం దరఖాస్తు చేసుకునే వధూవరులకు 10వ తరగతి ఉత్తీర్ణతను తప్పనిసరి చేసింది. గత అక్టోబరు నుంచి డిసెంబరు వరకు జరిగిన వివాహాలకు సంబంధించి అందిన దరఖాస్తులను జనవరిలో తనిఖీ చేసి ఫిబ్రవరిలో ఆర్థిక సాయం చెల్లించనుంది.
ప్రతి మూడు నెలలకు ఒకసారి దరఖాస్తులను పరిశీలించి నాలుగో నెలలో లబ్ధి అందించనుంది
Leave a Reply