Income Tax | మోదీ సర్కార్ వేతన జీవులకు తాజా బడ్జెట్‌లో అదిరిపోయే శుభవార్త అందించింది. కొత్త ట్యాక్స్ విధానంలోకి మారితే పలు రకాల బెనిఫిట్స్ కల్పిస్తోంది.
Nirmala Sitharaman | కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు ఊరట కలిగే ప్రకటన చేసింది. స్టాండర్డ్ డిడక్షన్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు చూస్తే.. రూ. 50 వేల స్టాండర్డ్ డిడక్షన్ బెనిఫిట్ కేవలం పాత ట్యాక్స్ (Tax) విధానంలోనే అందుబాటులో ఉండేది.
అయితే ఇకపై కొత్త ట్యాక్స్ విధానంలో కూడా స్టాండర్డ్ డిడక్షన్ బెనిఫిట్ అందుబాటులో ఉండనుంది. వేతన జీవులు, పెన్షన్లు (Pension), ఫ్యామిలీ పెన్షనర్లు ఇకపై కొత్త ట్యాక్స్ విధానంలో కూడా స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం పొందొచ్చు.
ఇక్కడ కొన్ని షరతులు ఉన్నాయి. అందరికీ ఈ బెనిఫిట్ వర్తించకపోవచ్చు. కేవలం రూ. 15.5 లక్షలు లేదా ఆపైన ఆదాయం కలిగిన ఉద్యోగులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. వీరికి రూ. 52,500 వరకు ప్రయోజనం కలుగుతుంది. ఈ విషయాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ స్పీచ్‌లో పేర్కొన్నారు.
కాగా కేంద్ర ప్రభుత్వం 2018 బడ్జెట్‌లో ఈ స్టాండర్డ్ డిడక్షన్ అనే వెసులుబాటు తీసుకువచ్చింది. ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్ స్థానంలో దీన్ని ప్రకటించారు. 2017-18 ఆర్థిక సంవత్సరం వరకు చూస్తే.. ట్రాన్స్‌ఫోర్ట్ అలవెన్స్ కింద రూ. 19,200 వరకు, మెడికల్ రీయింబర్స్‌మెంట్ కింద రూ. 15 వేల వరకు పన్ను తగ్గింపు పొందే ఛాన్స్ ఉండేది.
అయితే తర్వాత వీటి స్థానంలో స్టాండర్డ్ డిడక్షన్ వచ్చింది. రూ. 40 వేల వరకు ఈ విధానంలో పన్ను తగ్గింపు లభిచేంది. అయితే 2019 మధ్యంతర బడ్జెట్‌లో స్టాండర్డ్ డిడక్షన్ లిమిట్‌ను పెంచారు. రూ. 50 వేల వరకు పన్ను తగ్గింపు బెనిఫిట్ కల్పించారు.
ఇది వరకు స్టాండర్డ్ డిడక్షన్ లిమిట్ రూ. 40 వేలుగా ఉండేది. స్టాండర్డ్ డిడక్షన్ కింద పన్ను తగ్గింపు కోసం ఎలాంటి బిల్లులు చూపించాల్సిన పని లేదు.
అంతేకాకుండా స్టాండర్డ్ డిడక్షన్ అనేది కొత్త కాన్సెప్ట్ ఏమీ కాదు. 2004-05 వరకు కూడా ఇలాంటి డిడక్షన్ అందుబాటులో ఉండేది.అప్పట్లో డిడక్షన్ అనేది రూ. 30 వేలకు సమానంగా లేదంటే ఆదాయంలో 40 శాతం వరకు ఏది తక్కువ అయితే అది.. అంతవరకు డిడక్షన్ పొందే ఛాన్స్ ఉండేది.
రూ. 75 వేల నుంచి రూ. 5 లక్షల వరకు ఆదాయం కలిగిన వారికి ఇది వర్తించేది. అలాగే రూ. 5 లక్షలకు పైన ఆదాయం కలిగి ఉంటే అప్పుడు స్టాండర్డ్ డిడక్షన్ అనేది రూ. 20 వేలుగా లభించేది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్త ట్యాక్స్ విధానంలో కూడా స్టాండర్డ్ డిడక్షన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని వల్ల కొత్త ట్యాక్స్ విధానంలో పన్ను చెల్లించే ట్యాక్స్ పేయర్లకు ఊరట కలుగుతుంది.
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.