ఇప్పటికే ఏపీలో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం, జనసేన పార్టీలు ( Telugu Desam Jana Sena parties )కలిసి ముందుకు వెళ్లే విషయంలో క్లారిటీకి వచ్చాయి.ఈ మేరకు రెండు పార్టీలు విడివిడిగా పొలిటికల్ యాక్షన్ కమిటీలను నియమించుకున్నాయి రెండు పార్టీలను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లే విధంగా ఉమ్మడి కార్యాచరణను అమలు చేసే విధంగా ఓ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు .
TDP Janasena PAC Meeting Politics
ఇప్పటికే రెండు విడతలుగా రెండు పార్టీల పొలిటికల్ యాక్షన్ కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. ఇక మూడో విడత సమావేశాన్ని రేపు విజయవాడలో నిర్వహించేందుకు నిర్ణయించుకున్నారు .దానికంటే ముందుగా రాజకీయ పరిణామాలపై ఈరోజు రెండు పార్టీల నేతలు చర్చించనున్నారు.రేపటి జేఏసీ సమావేశానికి టిడిపి పిఎసి అజెండా ఖరారు చేయనున్నారు.
తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు అలాగే ప్రజా సమస్యలు, వైసిపి ప్రభుత్వం పోరాడాల్సిన అంశాల పైన ఈ సమావేశంలో చర్చించనున్నారు.ఈ సమావేశానికి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) తో పాటు జేఏసీలోని 12 మంది సభ్యులు హాజరవుతారు.అయితే జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ తో పాటు, కొంతమంది కీలక నేతలు హాజరవుతున్నా, పవన్ కళ్యాణ్ మాత్రం ఈ సమావేశానికి హాజరు కావడం లేదట. ఇక ఈ సమావేశంలో అనేక కీలక అంశాల పైన ప్రధానంగా చర్చించబోతున్నారట .గత భేటీలో మేనిఫెస్టో పై పవన్ కళ్యాణ్ , లోకేష్ మధ్య చర్చ జరిగింది .
ఆ తర్వాత టిడిపి అధినేత చంద్రబాబుతో పవన్, నాదెండ్ల మనోహర్( Nadendla mnohar ) మేనిఫెస్టో విడుదలపై చర్చించారు. రేపు జరిగే సమావేశంలో మేనిఫెస్టోకు సంబంధించి టిడిపి జనసేన చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోబోతుందట .సూపర్ సిక్స్ పేరుతో టిడిపి అనేక ప్రతిపాదనలను సిద్ధం చేయగా , జనసేన చతుర్ముఖ వ్యూహం పేరుతో ఆరు అంశాలను ప్రతిపాదించింది. రెండు పార్టీల నుంచి ఉన్న ప్రతిపాదనలపై ఇరు పార్టీల నేతలు చర్చించి, ఆ తర్వాత మేనిఫెస్టో పై కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం రెండు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు సమాచారం .
Leave a Reply