KCR News: తెలంగాణలో BRS ప్రభుత్వం గత ఎనిమిది ఏళ్లలో ఆస్తుల సృష్టిలో అసాధారణ వృద్ధిని పర్యవేక్షించింది. 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన సమయంలో ప్రభుత్వం వద్ద మొత్తం 60 లక్షల చదరపు అడుగుల భవనాలు ఉన్నాయి. అయితే గడచిన 8 ఏళ్ల కాలంలో ఇది 2.30 కోట్ల చదరపు అడుగులకు పెంచటం జరిగింది.
Telangana’s KCR Government Topped In Creating Assets Know Complete Details
కొత్తగా ఏర్పాు చేస్తున్న సెక్రటేరియట్ లోనే దాదాపు 8.50 లక్షల చదరపు అడుగులతో పాటు జిల్లాల్లో కలెక్టర్ సముదాయాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు నిర్మించబడ్డాయి. ఇవన్నీ భారీగా ఆస్తుల సృష్టికి దోహదపడ్డాయి. తెలంగాణ సామాజిక-ఆర్థిక సర్వే 2023 వివరాల ప్రకారం గోవా తర్వాత రెండవ స్థానంలో నిలిచింది. అలాగే ప్రధాన రాష్ట్రాలను పరిగణలోకి తీసుకుంటే మెుదటి స్థానంలో నిలిచింది.
తెలంగాణలో జిల్లాల సంఖ్యను 10 నుంచి 33కి పెంచినందున కొత్తగా ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టర్ కాంప్లెక్స్ లు, హైదరాబాద్‌లో అత్యాధునిక పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల ఫలితంగా రూ. 40 లక్షల చదరపు అడుగులకు పైగా ఆస్తులు పెరిగాయి. దీనికి తోడు హైదరాబాద్‌లో అతిపెద్ద ఇంక్యుబేటర్ ‘T-HUB 2.0’ని నిర్మించడానికి, IT టవర్‌లను నిర్మించడం ద్వారా IT రంగాన్ని టైర్-2 నగరాలకు విస్తరించడానికి ఐటీ మంత్రి కేటీఆర్ చొరవ ఫలితంగా 10,68,850 చదరపు అడుగుల ఆస్తులు ఏర్పడ్డాయి.
దీనికి తోడు కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో 61,544 చదరపు అడుగుల్లో బంజారా భవన్, 82,009 చదరపు అడుగుల్లో ఆదివాసీ భవన్ నిర్మాణం ద్వారా ఆస్తిని సృష్టించింది. దీనికి తోడు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో ఒక వైద్య కళాశాలను దానికి అనుబంధంగా ఒక వైద్య కళాశాలను నెలకొల్పడం వల్ల మరో 32 లక్షల చదరపు అడుగుల ఆస్తి ఏర్పడింది. BRS ప్రభుత్వం 2019లో హైదరాబాద్‌లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న MLA మరియు MLC క్వార్టర్లను పూర్తి చేయటంతో 2.88 లక్షల చదరపు అడుగుల ఆస్తుల సృష్టి జరిగింది. మొత్తం 119 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు క్యాంపు కార్యాలయాలు నిర్మించాలనే నిర్ణయం అదనంగా 4.23 లక్షల చదరపు అడుగుల ఆస్తిని సృష్టించనుంది.
తెలంగాణలో ఆస్తుల సృష్టి కేవలం భవనాల నిర్మాణానికి మాత్రమే పరిమితం కాలేదు. కేసీఆర్ ప్రభుత్వం రూ.35,000 కోట్ల వ్యయంతో మిషన్ భగీరథను, లక్ష కోట్ల రూపాయలు వెచ్చించి ప్రపంచ ప్రఖ్యాత కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మించింది. ఇది రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి నీటిని అందించేందుకు దోహదపడుతూ పంటలకు సాగు నీటిని, ప్రజలకు తాగు నీటిని అందిస్తోంది.
Leave a Reply