Harirama Jogaiah Pil On Ys Jagan Cases ఏపీ సీఎం జగన్ ఆస్తలు కేసుల వ్యవహారం తెలంగాణ హైకోర్టుకు చేరింది. ఈ కేసుల్ని త్వరగా తేల్చాలంటూ మాజీ ఎంపీ హరిరామజోగయ్య దాఖలు చేసిన పిల్‌పై విచారణ జరిగింది. ఈ పిల్‌కు నంబర్ కేటాయించాలని ఆదేశించిన ధర్మాసనం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు ఈ పిల్‌పై విచారణ చేయనుంది. 2024 ఎన్నికలలోపు జగన్ ఆస్తుల కేసులు తేల్చాలని పిల్లో జోగయ్య కోరారు.
ప్రధానాంశాలు:
- తెలంగాణ హైకోర్టులో మాజీ ఎంపీ పిల్
- ముఖ్యమంత్రి జగన్‌కు నోటీసులు జారీ
- పిల్‌కు గ్రీన్ సిగ్నల్.. నంబర్ కేటాయింపు
Telangana High Court Serves Notice to AP CM YS Jagan And CBI On Ex MP Harirama Jogaiah Petition
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీచేసింది. జగన్ ఆస్తుల కేసులో మాజీ ఎంపీ హరిరామ జోగయ్య వేసిన పిల్‌పై హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్.వి.శ్రావణ్‌కుమార్ ధర్మాసనం విచారణ జరిపింది. పిల్ గా పరిగణించేందుకు రిజిస్ట్రీ పేర్కొన్న అభ్యంతరాలపై విచారణ చేశారు. పిల్ లో సవరణలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. జోగయ్య తరఫు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనలతో ఏకీభవించింది.
ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించేందుకు హైకోర్టు ధర్మాసనం అంగీకరించింది.. హరి రామ జోగయ్య పిల్‌కు నెంబరు కేటాయించాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశించింది. ప్రతివాదులుగా జగన్, సీబీఐ, సీబీఐ కోర్టుకు తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. సీబీఐ కోర్టులో జగన్ కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలని హరిరామ జోగయ్య తెలంగాణ హైకోర్టును కోరారు.
ఏపీ సీఎం జగన్‌పై నమోదైన సీబీఐ, ఈడీ కేసులను 2024 ఎన్నికల్లోగా తేల్చేలా ఆదేశాలివ్వాలని మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిల్లో ప్రజాప్రయోజనం లేదని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం ఛేయగా.. ధర్మాసనం విచారణ జరిపింది.. అఫిడవిట్‌ను సవరించాలని తెలంగాణ హైకోర్టు హరిరామ జోగయ్యను ఇటీవల ఆదేశించింది.. రెండు వారాల గడువు కూడా ఇచ్చారు. ఆ డాక్యుమెంట్లపై వివరణతో అఫిడవిట్‌ను సవరించాలని.. కేసుల స్థాయి వివరాలను స్పష్టంగా ప్రస్తావించాలని ఆదేశించింది. ఈ పిల్‌పై విచారణ జరగ్గా.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు ధర్మాసనం.
Leave a Reply