ఈ మార్చి నెలలో హోళీ, ఉగాది, శ్రీరామనవమి పండుగలు ఉన్నాయి. ఇంకా మరో 5 సెలవులు ఉంటాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ విద్యార్థులకు ముఖ్య గమనిక. ఈ బుధవారంతో ప్రారంభమయ్యే మార్చి నెలలో భారీగా సెలవులు రానున్నాయి.
ఈ నెల 8వ తేదీన హోళీ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు, కాలేజీలకు సెలవు ఉంటుంది. ఇంకా.. తెలుగు సంవత్సరం ప్రారంభమయ్యే ఉగాది పర్వదినం కూడా ఈ నెలలోనే వచ్చింది.
ఈ నెల 22న ఉగాది సందర్భంగా విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలువు ఉంటుంది. ఇంకా మరో ముఖ్య పండుగ అయిన శ్రీరామ నవమి సైతం ఈ నెలలోనే వచ్చింది.
ఈ నెల 30న శ్రీరామనవమి సందర్భంగా సైతం సెలవు ఉంటుంది. ఇవి కాకుండా.. ఈ నెలలో 4, 11, 18, 25 తేదీల్లో ఆదివారం సందర్భంగా సెలవు ఉంటుంది.
10వ తేదీన రెండో శనివారం సందర్భంగా సెలవు ఉంటుంది. దీంతో ఈ నెలలో మొత్తం 8 సెలవులు ఉంటాయి.
ఇంకా.. ఈ నెల రెండో వారం నుంచి ఒంటి పూట బడులను ఆయా ప్రభుత్వాలు ప్రారంభించే అవకాశం ఉంది. ఎండ తీవ్రత అధికం అయితే.. కాస్త ముందుగానే ఈ ఒంటి పూట బడులను ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకోవచ్చు.
For any queries regarding above topic, please tell us through below comment session.
Leave a Reply