Aadhaar Card | ఆధార్ ప్రాధికార సంస్థ యూఐడీఏఐ తాజాగా కొత్త సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆధార్ మిత్ర సర్వీసులు లాంచ్ చేసింది. దీని ద్వారా ఆధార్ కార్డుదారులు పలు రకాల సేవలు పొందొచ్చు.
Aadhaar News | ఆధార్ కార్డు కలిగిన వారికి గుడ్ న్యూస్. కొత్త సేవలు అందుబాటులోకి వచ్చాయి. యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) తాజాగా కొత్త సర్వీసులు తీసుకువచ్చింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన చాట్ బాట్ సేవలు లాంచ్ చేసింది.
దీని ద్వారా ఆధార్ సంబంధిత సేవలను ప్రజలు పొందొచ్చు. ఈ కొత్త ఏఐ చాట్ బాట్ పేరు ఆధార్ మిత్ర. ఆర్టిఫీషియల్, మెషీన్ లెర్నింగ్ చాట్ బాట్ ద్వారా ప్రజలు ఆధార్ పీవీసీ స్టేటస్, ఫిర్యాదు చేయడం, వాటిని ట్రాక్ చేయడం వంటి పలు రకాల సేవలు పొందొచ్చు.
యూఐడీఏఐ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. డిజిటల్ ఏఐ చాట్ బాట్ తీసుకువచ్చినట్లు తెలిపింది. బెటర్ రెసిడెన్షియల్ ఇంటరాక్షన్ కోసం ఈ సేవలు తెచ్చినట్లు యూఐడీఏఐ తెలిపింది.
ఎవరైనా ఆధార్ మిత్ర ద్వారా సేవలు పొందాలని భావిస్తున్నారో వారు యూఐడీఏఐ వెబ్‌సైట్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఆధార్ మిత్ర సేవలు పొందొచ్చు. చాలా సింపుల్‌గా ఈ చాట్ బాట్ ద్వారా పలు సర్వీసులు పొందొచ్చని యూఐడీఏఐ పేర్కొంటోంది.
మీరు మీ పిల్లల కోసం కొత్తగా ఆధార్ కార్డు తీసుకోవాలని భావిస్తే.. లేదంటే పిల్లల ఆధార్ వివరాల అప్‌డేట్, లేదంటే మీ ఆధార్ వివరాల అప్‌డేట్ వంటి వాటి కోసం దగ్గరిలో ఆధార్ సెంటర్ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి కూడా మీరు ఈ చాట్ బాట్ ఉపయోగించొచ్చు.
ఇంకా మీరు ఈ ఆధార్ మిత్ర చాట్ బాట్ ద్వారా ఎన్‌రోల్‌మెంట్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఇంకా మీరు ఏమైనా ఆదార్‌లో వివరాలను అప్‌డేట్ చేసి ఉంటే.. అప్పుడు ఆ అప్‌డేట్ స్టేటస్ కూడా మీరు ఈ చాట్ బాట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
యూఐడీఐఏ ట్వీట్‌లో క్యూఆర్ కోడ్ కూడా ఉంది. దీన్ని స్కాన్ చేయడం మీరు నేరుగా ఆధార్ మిత్ర ద్వారా సేవలు పొందొచ్చు. ఈ క్యూఆర్ కోడ్‌లో యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ లింక్ ఉంటుంది. మీరు కోడ్ స్కాన్ చేస్తే యూఐడీఏఐ వెబ్‌సైట్‌లోకి వెళ్లి పోతారు.
అంతేకాకుండా మీరు ఈ ఆధార్ మిత్ర చాట్ బాట్ ద్వారా ఆధార్ సెంటర్‌లో అపాయింట్‌మెంట్ కూడా బుక్ చేసుకోవచ్చు. దీని వల్ల మీకు వీలు ఉన్న సమయంలో ఆధార్ సెంటర్‌కు వెళ్లి మీ పని పూర్తి చేసుకొని రావొచ్చు. ఇక ఏమైనా ఆధార్‌కు సంబంధించి సమస్యలు ఉంటే ఆధార్ మిత్ర ద్వారా ఫిర్యాదు చేయొచ్చు.
Leave a Reply