Telangana: తెలంగాణలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ కింద వివిధ కార్యక్రమాలకు గడచిన 9 ఏళ్లలో రూ.2,626 కోట్లను ఖర్చు చేసినట్లు సామాజిక-ఆర్థిక సర్వే నివేదిక వెల్లడించింది.
Telangana KCR Government Spent 2626 Crores in 9 Years Under Economic Support Schemes
2023-2024 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ కులాలు (ఎస్సీలు) కోసం ESS కింద రూ. 100 కోట్లు, షెడ్యూల్ తెగల (ఎస్టీలు) కోసం రూ.323.45 కోట్లను కేటాయించింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలతో పాటు ఇతర బలహీన వర్గాల ఆర్థిక అభ్యున్నతే లక్ష్యంగా ESS కార్యక్రమాన్ని రూపొందించటం జరిగింది.
ఈఎస్ఎస్ కింద 2014 నుంచి 2023 వరకు తెలంగాణ ప్రభుత్వం మెుత్తంగా రూ.2,029 కోట్లను సబ్సిడీ రూపంలో అందించింది. ఈ డబ్బు వెనుకబడిన తరగులకు చెందిన 1,62,444 మంది లబ్ధిదారులకు ప్రోత్సాహకంగా అందించటం జరిగింది. షెడ్యూల్డ్ కులాల నుంచి పరిశ్రమలు, సేవలు, వ్యాపారం, రవాణా రంగాల్లో ఉన్న వారికి సబ్సిడీ రూపంలో స్కీమ్ ఆర్థిక సహాయాన్ని అందించింది. అలాగే రూ. 460.39 కోట్ల విలువైన సబ్సిడీలు, బీసీ కార్పొరేషన్, అత్యంత వెనుకబడిన తరగతులు, 11 బీసీ ఫెడరేషన్‌ల కింద లబ్ధిదారులకు అందించబడ్డాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్.. గిరివికాసం, గ్రామీణ రవాణా, గిరిజన కళాకారులు, MSMEలు, ST నైపుణ్య శిక్షణతో పాటు ఇతర పథకాల ద్వారా 20,888 షెడ్యూల్ తెగల లబ్ధిదారులకు జీవనోపాధి రంగాల్లో రూ.135.87 కోట్లు వెచ్చించారు. 17,240 మంది అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు షెడ్యూల్డ్ కులాల కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించింది. ఎస్సీ యువతకు శిక్షణ ఇచ్చేందుకు రూ.104.62 కోట్లు వెచ్చించగా.. తర్వాత వారు ప్రముఖ కంపెనీల్లో ఉపాధిని పొందారు.
Leave a Reply