EPFO Recruitment 2023: నిరుద్యోగులకు ఇది శుభవార్తనే చెప్పాలి. కేంద్ర కార్మిక శాఖ పరిధిలోని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 577 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు యూపీఎస్సీ షార్ట్ నోటిఫికేషన్ లో తెలిపింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ (ఈవో), అకౌంట్స్ ఆఫీసర్ (ఏవో) తో పాటు అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (APFC) ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
UPSC EPFO Recruitment 2023 (577 Vacancies Check For All Details)
ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 577 ఉద్యోగాలని భర్తీ చేయనున్నారు. అందులో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ (ఈవో)/అకౌంట్స్ ఆఫీసర్(ఏవో) ఉద్యోగాలు 418, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టులు 159 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి ఫిబ్రవరి 25 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభంకానుంది. మార్చి 17న సాయంత్రం 6గంటలకి ముగుస్తుంది. ఈ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి అధికారిక వెబ్‌సైట్ upsconline.nic.in సందర్శించాలి.
ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి ఏదైనా డిగ్రీ చదివి ఉండాలి. ఈవో/ఏవో ఉద్యోగాలకు 18 నుంచి 30 ఏళ్లు, ఏపీఎఫ్‌సీ పోస్టులకు 18 నుంచి 35 ఏళ్ల వరకు వయో పరిమితి ఉంటుంది. అలాగే జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.25 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీబ్ల్యూడీ/మహిళలకు ఫీజు లేదు. ఆన్‌లైన్‌లోనే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఉద్యోగులని ఎంపిక చేస్తారు. పరీక్ష తేదీతో పాటు మిగతా అన్ని వివరాలను మరికొద్ది రోజుల్లో upsc.gov.in / upsconline.nic.in ద్వారా నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
Leave a Reply