గత నెలకు సంబందించిన మీ సచివాలయ పరిధిలో వాలంటీర్లకు గౌరవ భృతి ను ఆన్ లైన్ చేయిటకు ఆప్షన్ ఓపెన్ అవ్వటం జరిగింది. Payroll HERB సైట్ లొ DDO వారు లాగిన్ అయ్యి Volunteers Supplementary Pay Bill Submission Tile అనే ఆప్షన్ లొ బిల్ ప్రిపేర్ చేసి సబ్మిట్ చేసి, CFMS లొ డాక్యుమెంట్ లు అప్లోడ్ చేసి DDO వారి ధ్రువీకరణ తో సబ్మిట్ చెయ్యవలెను.
ప్రభుత్వం నియమించిన గ్రామ, వార్డు వలంటీర్లకు గౌరవ భృతి వారి ఖాతాల్లో డిపాజిట్ చేయనున్నారు. బ్యాంకు ఖాతాల వివరాల సేకరణ గురువారంతో పూర్తి కానుంది. వివరాల సేకరణలో చిత్తూరు జిల్లా ముందంజలో నిలవగా కృష్ణా, విశాఖపట్టణం జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. గ్రామ, వార్డు వలంటీర్లు గత నెల 15 నుంచి విధుల్లో చేరారు. వలంటీర్లు వారికి కేటాయించిన ఇళ్ళ యజమానుల నుంచి ఇంటింటి (బేస్లైన్) సర్వే చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని 8 మునిసిపాలిటీలు, 1372 గ్రామ పంచాయతీల్లో 16,059 మంది వలంటీర్లకు గాను 15,418 మంది పని చేస్తున్నారు. ఇంతవరకు జిల్లాలో అన్ని మునిసిపాలిటీ, ఎంపీడీవోల నుంచి వలంటీర్ ల డేటా ఎంట్రీ 95 శాతం డీపీవో కార్యాలయం సేకరించి ప్రభుత్వానికి పంపింది. మిగతా 5 శాతం సేకరణ గురువారంతో పూర్తి కానుంది.
For any queries regarding above topic, please tell us through below comment session.
Leave a Reply