తెలంగాణ రాష్ట్రంలోని మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమమే వీ-హబ్. వీ-హబ్ అంటే ఉమెన్ ఎంట్రప్రెన్యూర్స్ హబ్ అన్నమాట. 2018 మార్చి8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దీన్ని ప్రారంభించారు.
ప్రధానాంశాలు:
- మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం
- గ్లోబల్ మార్కెట్‌పై ఎదిగేలా సాయం
- సమసమాజాన్ని స్థాపిస్తోన్న వీ-హబ్
- వీ-హబ్ తొలి ఫ్లాగ్‌షిప్ రూరల్ ఇంక్యుబేషన్ ప్రొగ్రామ్ లాంచ్
తెలంగాణ రాష్ట్రంలోని మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమమే వీ-హబ్. వీ-హబ్ అంటే ఉమెన్ ఎంట్రప్రెన్యూర్స్ హబ్ అన్నమాట. 2018 మార్చి8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దీన్ని ప్రారంభించారు. వీ-హబ్ కింద మహిళా వ్యాపారవేత్తలు స్థాపించే స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తూ వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలను అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.
మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు దేశంలోనే తీసుకొచ్చిన ప్రప్రథమ కార్యక్రమం ఇది. వీ-హబ్ సాంకేతికలో అభివృద్ధి చెందుతోన్న రంగాలపై ఫోకస్ చేసే వినూత్న ఆలోచనలు, పరిష్కారాలతో ఉన్న మహిళా పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీ-హబ్ ప్రధాన లక్ష్యం మహిళలకు ఆర్థికంగా, సామాజికంగా ఉన్న అడ్డంకులను తొలగించి, వ్యాపారంలో విజయం సాధించడంలో సాయపడటం. దేశవ్యాప్తంగా ఉన్న మహిళలు నిర్వహించే స్టార్టప్‌లకు ఇది వన్ స్టాప్ డెస్టినేషన్‌గా ఉంటోంది. తెలంగాణలో, భారత్‌లోనే కాక గ్లోబల్ మార్కెట్‌పై మహిళా వ్యాపారవేత్తలు ఎదిగేలా వీ-హబ్ సహకరిస్తుంది.
వీ-హబ్ పూర్తి వివరాలు..
ఆవిష్కరణ తేదీ : 2018 మార్చి 8
ప్రధాన లక్ష్యం : మహిళా వ్యాపారవేత్తలకు ఆర్థికంగా, సామాజికంగా ఉన్న అడ్డంకులను తొలగించడం, ప్రోత్సహించడం
అధికారిక వెబ్‌సైట్ : https://wehub. telangana.gov.in/
మహిళా వ్యాపారవేత్తలను ఎలా ప్రమోట్ చేస్తారు?
- మహిళలు వ్యాపారవేత్తలుగా మారేందుకు ప్రభుత్వ సంస్థలు, ఇండస్ట్రీలు, విద్యాసంస్థలు, కార్పొరేట్లతో కోలాబరేట్ అయి పనిచేసే అవకాశం కల్పించడం
- నిధులు అందించడం, మెంటరింగ్ సపోర్టు అందివ్వడం ద్వారా మహిళా వ్యాపారవేత్తల స్టార్టప్‌ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతోంది. అంతేకాక మహిళా వ్యాపారావేత్తలలో సాధికారత తీసుకువస్తోంది
- విధాన కార్యాచరణ, పరిశోధన ద్వారా ప్రభుత్వ పథకాల యాక్సెస్‌ను వారికి కల్పించడం
- స్టార్టప్‌లను ఇంక్యుబేట్ చేయడంతో పాటు వాటి గ్రోత్‌కు అవసరమైన నిధులు సమకూర్చేందుకు కూడా ప్రభుత్వం టీ-ఫండ్ పేరుతో వెంచర్ క్యాపిటల్ నిధిని కల్పించింది. ఈ నిధి ద్వారా వీ-హబ్ ఇప్పటికే పలు స్టార్టప్‌లకు పెట్టుబడి సాయం చేసింది.
- మహిళల నేతృత్వంలోని అన్ని రకాల స్టార్టప్‌లకు ఇది సహాయ సహకారాలను అందిస్తోంది. వీ-హబ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు website http://wehub. telangana.gov.in/ వెళ్లాల్సి ఉంటుంది.
వీ-హబ్ కేవలం మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించడమే కాకుండా.. పురుషులకు, మహిళలకు మధ్య సమాన ప్రపంచాన్ని ఏర్పాటు చేస్తోంది. లాక్ డౌన్ కాలంలో రూ.35 కోట్ల విలువైన క్రెడిట్ లింకేజీలను నిర్వహించింది. అంతేకాక వీహబ్ ప్రారంభమైనప్పటి నుంచి మహిళా వ్యాపారవేత్తలకు పెద్ద మొత్తంలో మార్కెట్ యాక్సస్, పెట్టుబడులు లభించాయి.
గ్రామాల్లో మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు వీ-హబ్ తన తొలి ఫ్లాగ్‌షిప్ రూరల్ ఇంక్యుబేషన్ ప్రొగ్రామ్‌ను లాంచ్ చేసింది. ముఖ్యంగా తయారీ, టెక్స్‌టైల్స్, హ్యాండ్‌లూమ్స్, ఎఫ్‌ఎంసీజీ, ఫుడ్ ప్రాసెసింగ్, హ్యాండిక్రాఫ్ట్స్ వంటి ఐదు ముఖ్యమైన రంగాలలో 50 మహిళా ఎంట్రప్రెన్యూర్లకు ఇంక్యుబేట్ చేస్తోంది. దీని కోసం అప్లికేషన్ ప్రాసెస్‌ను కూడా ప్రారంభించింది. టైర్ 2, 3 రీజన్లలో సంస్థలను మరింత ప్రోత్సహించేందుకు రూరల్ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ పనిచేస్తుందని వీహబ్ సీఈవో దీప్తి రావుల చెప్పారు. ఇలా స్టార్టప్ కంపెనీలకు వీ-హబ్ పలు ఇంక్యుబేషన్ ప్రొగ్రామ్‌లను చేపడుతోంది. వీ-హబ్ ఇప్పటి వరకు మహిళలు నిర్వహించే 4527 స్టార్టప్‌లకు సపోర్టు ఇచ్చింది.
Who is eligible to apply to WE HUB?
Any women led startups is eligible. Any startup which has a women holding 51% stake holding pattern in a company is considered as women-led startup.
How are the applicants selected for the program at WE HUB
Applicants will be invited for a pitch day, where the jury consists of representatives from partner organizations to evaluate pitches. Selected applicants will be notified via email with further steps.
Do we need to have the entire idea fully working?
The entire idea need not be fully implemented however, the submission should be functional so that it can be reviewed by the judges.
How can I apply to WE HUB’s incubation program?
Please follow this link for the application form if you are eligible to apply. Upon review of your application, you will be hearing from us on further steps.
How does WE HUB help with funding?
WE HUB actively helps startups with credit linkages and helps identify schemes/subsidies that startups can operationalize.
Will mentors be provided to each team?
Yes, mentors will be provided for every team.
We-Hub Innovation Impact
Created Jobs : 2,823
Startups Supported : 1,495
Startups Incubated : 2,194
Partner Connets : 53
Startup Programs : 21
Funding Raised (in crores) : 66.3
Entrepreneurs Engaged so far : 5,235
Service Providers : 50
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.
Leave a Reply