వైయస్ఆర్ ఆసరా (నవరత్నాలు) పథకం :
ఈ పథకం కింద ఎన్నికల రోజు వరకు ఉన్న పొదుపు సంఘాల రుణం మొత్తాన్ని నాలుగు దఫాలుగా అక్కచెల్లెమ్మల చేతికే నేరుగా అందిస్తారు. అంతేకాకుండా సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తారు.
ఆ వడ్డీ డబ్బును ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుంది. దీనివల్ల ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.50 వేల వరకు ప్రయోజనం చేకూరుతుంది.
అదేవిధంగా “వైయస్ఆర్ చేయూత” ద్వారా 45 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు రెండో ఏడాది నుంచి నాలుగేళ్లలో రూ.75 వేలు దశలవారీగా ఆయా కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా అందిస్తారు.
Recent Posts
ఈబీసీ నేస్తమ్ మంజూరైంది FY 2023
వైఎస్సార్ ఆసరా , వైఎస్సార్ చేయూత
ఎన్నికల రోజు వరకు అక్కచెల్లమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును 4 దఫాలుగా నేరుగా వారి చేతికే అందిస్తాం.
అంతే కాదు మళ్ళీ సున్నా వడ్డీకే రుణాల విప్లవం తెస్తాం ఆ వడ్డీ డబ్బు మేమే బ్యాంక్ లకు అక్కచెల్లమ్మల తరపున కడతాం.
వైఎస్సార్ చేయూత ద్వారా ప్రతి బిసి ,ఎస్సీ ఎస్టీ , మైనారిటీ అక్కలకు తోడుగా ఉంటాం.
ప్రస్తుతం కార్పొరేషన్ల వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ అందరికీ మేలు జరిగేలా, ఏ కొందరికో అరకొరగ ఇస్తూ అది కూడా లంచం లేనిదే ఇవ్వని పరిస్డితులను మారుస్తూ పారదర్శక ప్రమాణాలను తీసుకువస్తాం.
45 సంవత్సరాలు నిండిన ప్రతి బిసి, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ అక్కలకు వైఎస్సార్ చేయూత ద్వారా మొదట ఏడాది తరువాత దశలవారీగా రూ. 75 వేలు ఆయా కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా ఇస్తాం.
సమస్యల పరిష్కారం కొరకు టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించండి : 1902
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ సెషన్ ద్వారా మాకు తెలియజేయండి.
Leave a Reply