ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
వై.ఎస్.ఆర్. చేయూత అంటే ఏమిటి ?
45 – 60 సంవత్సరముల మధ్య వయస్సు ఉన్నఎస్.సి. / ఎస్.టి. / బి.సి. / మైనారిటీ మహిళల ఆర్థిక సాధికారత వరకు సంవత్సరానికి రూ.18,750/- చొప్పున నాలుగు సంవత్సరాలలో ఒక్కొక్కరికి రూ.75,000/- లు వై.ఎస్.ఆర్. చేయూత పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించబడుతుంది.
అర్హతలు :
మొత్తం కుటుంబ అదాయం గ్రామీణ ప్రాంతాలలో నెలకు రూ.10,000 మరియు పట్టణ ప్రాంతాలలో అయితే రూ.12,000 కంటే తక్కువ ఉండాలి.
మొత్తం కుటుంబానికి ౩ ఎకరాల మాగాణి భూమి లేదా 10 ఎకరాల మెట్ట లేదా మాగాణి మరియు మెట్ట భూములు రెండు కలికి 10 ఎకరాలు మించరాదు.
కుటుంబంలో ఏ ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛనుదారుడై ఉండరాదు (పారిశుధ్య కార్మికులకు మినహాయింపు).
కుటుంబం నివసిస్తున్న గృహం (సొంతం/ అద్దె) యొక్క నెలవారీ విద్యుత్ వినియోగ బిల్లు 300 యూనిట్లు లోపు ఉండవలెను. (గత ఆరు నెలల విద్యుత్ వినియోగ బిల్లు యొక్క సగటు 300 యూనిట్లు లేదా అంతకు తక్కువ ఉండవలెను.)
పట్టణ ప్రాంతంలో నిర్మాణపు స్థలము 1000 చదరపు అడుగులు కంటే తక్కువ ఉండాలి.
కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరికైన 4 వీలర్ (నాలుగు చక్రములు) సొంత వాహనము ఉన్నట్లయితే (ఆటో,టాక్సీ మరియు ట్రాక్టర్ ఇందుకు మినహాయింపు) అనర్హులుగా పరిగణించవలెను.
కుటుంబంలో ఏ ఒక్కరు ఆదాయపు పన్ను చెల్లించే పరిధిలో వుండరాదు.
ఆధార్ కార్డు కలిగి ఉండాలి.
ప్రభుత్వం జారీచేసిన సమగ్ర కులధృవీకరణ పత్రం (S.C., S.T., B.C., Minarity) కలిగి ఉండవలెను.
దరఖాస్తు చేసుకొనే విధానము: –
అర్హత కల్గిన వారు సమగ్ర కులధృవీకరణ పత్రం మరియు ప్రభుత్వ గుర్తింపు కార్డుతో పాటు స్వయంగా గ్రామ/వార్డు సచివాలయాలలో గానీ లేదా గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా గానీ దరఖాస్తు చేసుకోవచ్చును.
అర్హులైన దరఖాస్తుదారునికి YSR (Your Service Request- మీ సేవల అభ్యర్థన) నెంబర్ ఇవ్వబడుతుంది.
దరఖాస్తు చేసిన లబ్దిదారులకు నిర్దేశించిన ప్రక్రియలు అన్నీ పూర్తిచేసి అర్హత కలిగిన వారికి రూ.18,750/- ప్రభుత్వముచే అందించబడుతుంది.
సలహాలు, సూచనలు మరియు ఫిర్యాదుల కొరకు టోల్ ఫ్రీ నెంబర్ : 1902
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.
Leave a Reply