కాపు వర్గానికి చెందిన పేద ప్రజలకు ఆర్థిక సహాయం కోసం మరియు స్వయం ఉపాధి కల్పించడం కోసం వైయస్సార్ కాపు నేస్తం పథకాన్ని ప్రారంభించింది. 2023 వ సంవత్సరానికి గాను కాపు నేస్తందరఖాస్తు ప్రక్రియ మరియు పాత లబ్ధిదారుల వెరిఫికేషన్ పూర్తయింది
కాపు నేస్తం పథకానికి కొత్తగా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి జూలై 22 చివరి తేదీగా ప్రకటించారు. అయితే తేదీ ముగిసిన చాలామంది అర్హులు వివిధ కారణాల చేత అప్లై చేసుకోలేని కారణంగా ఈ దరఖాస్తు ప్రక్రియను జూలై 25 వరకు పొడిగించారు.
మళ్లీ మళ్లీ ఈ ప్రక్రియకు జూలై 27 వరకు అవకాశం కలిగించింది. అయితే టైం లైన్స్ ప్రకారం ఫీల్డ్ వెరిఫికేషన్ గడువు పూర్తయింది. ప్రస్తుతం లబ్ధిదారులు ఈ కేవైసీ ప్రక్రియ కొనసాగుతుంది. EKYC కొరకు ఆగస్టు 20 చివరి తేదీ.
ప్రారంభమైన లబ్ధిదారుల ఈ కేవైసీ ప్రక్రియ (Kapu Nestham EKYC 2023-24)
సచివాలయం బెనిఫిషరీ ఔట్రీచ్ యాప్ ద్వారా లబ్ధిదారుల ఈ కేవైసీ ప్రక్రియ నమోదు చేస్తున్నారు. లబ్ధిదారులు అందరూ తప్పనిసరిగా మీ సచివాలయంలో కానీ లేదా మీ వాలంటీర్ ను సంప్రదించి ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయవచ్చు.
బెనిఫిషియరీ ఔట్రీచ్ యాప్ మరియు ఈ కేవైసీ చేయు పూర్తి విధానం కింది లింక్ లో ఇవ్వబడింది చెక్ చేయండి.
Download Beneficiary Outreach app for EKYC
కాపు నేస్తం జాబితా NBM పోర్టల్ లో విడుదల [ Kapu Nestham 2023-24 Final Eligible List ]
మరోవైపు సచివాలయం ఎన్.బి.ఎం అనే పోర్టల్ ద్వారా లబ్ధిదారుల తుది జాబితాను విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా లబ్ధిదారులు NBM పబ్లిక్ పోర్టల్ ద్వారా నేరుగా తమ అప్లికేషన్ స్టేటస్ ను తెలుసుకోవచ్చు.
ఎవరికైతే తుది జాబితాలో పేరు ఉంటుందో వారు తప్పనిసరిగా థంబ్ వేసి ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.
లబ్ధిదారులు తమ అప్లికేషన్ స్టేటస్ వివరాలను కింది లింక్ పై క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు. ఆధార్ నెంబర్ కి లింక్ అయిన మొబైల్ కి ఒక ఓటిపి వస్తుంది. అది ఎంటర్ చేయగానే మీకు మీ వివరాలు కనిపిస్తాయి.
Kapu Nestham 2023-24 Eligibility List
Click here for Kapu Nestham Status 2023-24
Kapu Nestham 2023-24 Release Date
ఈ నెల 22న తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పర్యటనలో భాగంగా కాపు నేస్తం పథకం అమౌంట్ ను ముఖ్యమంత్రి విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అర్హులైన లబ్ధిదారులు వెంటనే eKYC పూర్తి చెయ్యండి. eKYC పూర్తి చేసిన వారికి మాత్రమే అమౌంట్ జమ అవుతుంది అని ప్రకటించింది.
Click Here to Download Kapu Nestham Launching GO
For any queries regarding above topic, please tell us through below comment session.
Leave a Reply