వైఎస్ఆర్ క్రాంతిపథం గురించి : కేంద్రానికి సంబంధంచిన డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (DRDA) మరియు రాష్ట్రానికి సంబంధంచిన సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (SERP) లు కలసి వైఎస్ఆర్ క్రాంతి పథం ని అమలు చేస్తున్నాయి. వైఎస్ఆర్ క్రాంతిపథం క్రింద YSR పెన్షన్ కానుక, SHG బ్యాంక్ లింకేజీ, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ సున్నవడ్డి, జగనన్నతోడు, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ బీమా, స్త్రీనిధి, వైఎస్ఆర్ ఉన్నతి మొదలగు పథకాలను అర్హులైన ప్రతి ఒక్క పేద ప్రజలకు క్షేత్ర స్థాయిలో పరిశీలించి వారికి సకాలంలో ఆర్థిక సహాయం అందజేయడమే వైఎస్ఆర్ క్రాంతిపథం లక్ష్యం.
DISTRICT RURAL DEVELOPMENT AGENCY : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 13 డిఆర్‌డిఎలలో దాదాపు 226 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కడప జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో ప్రస్తుతం దాదాపు 16 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. రెండున్నర దశాబ్దాల క్రితం గ్రామాభివృద్ధిలో డీఆర్‌డీఏ ప్రముఖ పాత్ర పోషించింది. చాలా మంది కొత్త IAS అధికారులు DRDA ప్రాజెక్ట్ డైరెక్టర్లుగా నియమితులయ్యారు. . అర్హులైన పేదలకు పెన్షన్లు మరియు ఆర్థిక సహాయం వంటి సంక్షేమ పథకాలు DRDA ద్వారా అమలు చేయబడతాయి.
అర్హులైన పేదలకు వివిధ పథకాల కింద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు డీఆర్‌డీఏ ద్వారా అందజేసారు. డిఆర్‌డిఎ సిబ్బంది జీతాల్లో 75 శాతం కేంద్ర ప్రభుత్వం చెల్లించింది, మిగిలినది రాష్ట్ర ప్రభుత్వ సహకారం. డిఆర్‌డిఎలను రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ శాఖ పరిధిలోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.
Leave a Reply