ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
వై.యస్.ఆర్. నేతన్న నేస్తం అంటే ఏమిటి ?
చేనేత కార్మికుల స్టితి గతులను మెరుగుపరిచి వారి జీవన ప్రమాణాలను పెంపొందించటమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ అపూర్వ పథకానికి శ్రీకారం చుట్టింది.
ప్రయోజనాలు
మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.24,000/-లు ప్రోత్సాహకంగా అందించటం ద్వారా తమ మగ్గాలను ఆధ్రునీకరించుకుని మరమగ్గాలతో పోటీపడేందుకు ఉపకరిస్తుంది
అర్హతలు
సొంత మగ్గం కలిగిన చేనేత కుటుంబము మాత్రమే అర్హులు
ఒక చేనేత కుటుంబములో ఎన్ని చేనేత మగ్గాలు ఉన్నప్పటికీ ఒక లబ్దిదారునికి మాత్రమే ఇవ్వబడుతుంది.
ఈ పథకంలో లబ్ది పొందాలంటే నెలసరి కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో రూ.10,000/-లోపు, పట్టణ ప్రాంతాలలో రూ.12,000/-లోపు ఉండాలి
అర్హుల జాబితాలో పేరు లేనివారు దరఖాస్తు చేసుకొనే విధానము
అర్హత కల్లిన చేనేత కార్మికులు తమ దరఖాస్తులను గ్రామ-వార్డ్ వాలంటీర్ల ద్వారా కాని, లేదా స్వయంగా గ్రామ-వార్డు నందు గాని సమర్పించవలెను మరియు AP SEVA PORTAL ద్వారా ఆన్లైన్ లో కూడా దరఖాస్తు చేసుకొనవచ్చును.
సలహాలు, సూచనలు మరియు ఫిర్యాదుల కొరకు టోల్ ఫ్రీ నెంబర్ : 1902
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.
Leave a Reply