మండల సమాఖ్య అకౌంటెంట్లకు ముఖ్య గమనిక : పెళ్లి కానుక పధకంలో నమోదు చేసుకునే సమయములో వేలిముద్రలు సరిగా పడని లబ్ధిదారుల కొరకు ప్రతి జిల్లా కార్యాలయమునకు IRIS డివైస్ లను పంపడం జరిగినది. కనుక అందరూ మీ జిల్లా కార్యాలయముల ను సంప్రదించి IRIS డివైస్ లను తీసుకొనగలరు.
వైఎస్ఆర్ పెళ్లి కానుక పథకం వివరాలు
వైఎస్సార్ పెళ్ళికానుక ఆన౦దాల వేడుక. పూర్తి డిజిటల్ అప్లికేషన్ ప్రక్రియ.
“రాష్ట్రములోని నిరుపేద కుటుంబాలలో ఆడపిల్ల వివాహ కార్యక్రమము భారం కాకుండా మరియు పెళ్లి కుమార్తె పెళ్లి అయి అత్త వారింటికి వెళ్ళిన తరువాత కూడా అభద్రతా భావంతో ఉండకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం వారు పెళ్లి కానుక పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం పేదింటి ఆడపిల్లకు ఆర్ధిక సహాయం చేయడం ద్వారా అండగా ఉండడమే కాక, బాల్య వివాహాలు నిర్మూలించేందుకు మరియు వివాహం రిజిస్ట్రేషన్ చెయ్యడం ద్వారా వధువుకి రక్షణ కల్పించడం ”వైఎస్సార్ పెళ్ళికానుక” రూప కల్పన ముఖ్య ఉద్దేశ్యం.”
పథక మార్గదర్శకాలు
1. మండల సమాఖ్య / మెప్మా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.
2. అనంతరం అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు.
3. వివాహానికి ముందే సాయం మొత్తంలో 20 శాతం పెళ్లికుమార్తె బ్యాంకు ఖాతాలో వేస్తారు.
4. వివాహమయ్యాక మిగతా మొత్తాన్ని జమ చేస్తారు.
5. అనంతరం వివాహ ధ్రువీకరణ పత్రం ఇస్తారు.
వైఎస్సార్ పెళ్ళికానుక లో నమోదు చేసుకునే విధానము
నమోదు చేసుకునే సమయానికి వివాహ వేదిక, వివాహ సమయం నిర్ణయించ బడి ఉండాలి. వివాహ తేదీకి కనీసం 5 రోజుల ముందు నమోదు చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారు రూరల్ వెలుగు మండల మహిళ సమాఖ్యలో నమోదు చేసుకోవచ్చు.
నమోదు చేసుకునే సమయానికి వివాహ వేదిక, వివాహ సమయం నిర్ణయించ బడి ఉండాలి. వివాహ తేదీకి కనీసం 5 రోజుల ముందు నమోదు చేసుకోవాలి. పట్టణ ప్రాంతంలో ఉండేవారు అర్బన్ మెప్మా లో నమోదు చేసుకోవచ్చు.
For any queries regarding above topic, please tell us through below comment session.
Leave a Reply