వైయస్ఆర్ రైతు భరోసా (నవరత్నాలు) పథకం :
ప్రతి రైతు కుటుంబానికి ప్రతి యేటా రూ.13500 పెట్టుబడి కోసం ఇస్తారు. ఉచిత బోర్లు వేయించడం, ఉచిత విద్యుత్ అందించడం, సున్నావడ్డీకి రుణాలు, రైతులు వాడే ట్రాక్టర్లపై రోడ్ టాక్స్ మాఫి ఇందులో వర్తించే అంశాలే. ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి ఏడాది నుంచి మే నెలలో పెట్టుబడి కోసం ఏడాదికి రూ.13,500 చొప్పున వరుసగా ఐదేళ్లు అందించటం జరుగుతుంది .
వ్యవసాయానికి పగలే 9 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తారు. ఆక్వా రైతులకు కరెంట్ చార్జీలను యూనిట్ కు రూ.1.50కు తగ్గించటం. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.4 వేల కోట్లతో ప్రకతి వైపరీత్యాల సహాయ నిధి ఏర్పాటు.
ప్రతి నియోజకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు, అవసరమైతే ఆహారశుద్ధి యూనిట్లను ఏర్పాటు చేయటం. సహకార రంగాన్ని పునరుద్ధరించి.
సహకార డైరీలకు పాలుపోసే పాడి రైతులకు లీటర్ కు రూ.4 సబ్సిడీ ఇస్తారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు “వైయస్ఆర్ బీమా” ద్వారా రూ.5 లక్షలు చెల్లించటం జరుగుతుంది.
వైఎస్సార్ రైతు భరోసా – YSRCP Navaratnalu (జగన్ నవరత్నాలు) ప్రధాన పధకం
- ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం రూ.50 వేలు ఇస్తాం. పంటవేసే సమయానికి మే నెలలో రూ.12,500 చొప్పున ఇస్తాం.
- పంట బీమా గురించి రైతులు ఆలోచించాల్సిన పనిలేదు. రైతన్న చెల్లించాల్సిన బీమా ప్రేమియమ్ మొత్తాన్ని మేమే చెల్లిస్తాం.
- రైతన్నలకి వడ్డీ లేని పంట రుణాలు ఇస్తాం.
- రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తాం.
- వ్యవసాయానికి పగటిపూటే 9 గం. ఉచిత కరెంట్.
- ఆక్వారైతులకు కరెంట్ ఛార్జీలు యూనిట్ కు రూ.1.50 కే ఇస్తాం.
- రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, పంట వేసే ముందే రేట్లు కూడా ప్రకటిస్తాం. గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం.
- రూ. 4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు.
- ప్రతి నియోజలకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు, గోదాములు మరియు అవసరం మేరకు ప్రతి నియోజక వర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు.
- మొదటి ఏడాది సహకార రంగాన్ని పునరుద్ధరిస్తాం. రెండవ ఏడాది నుంచి సహకార డైరీకి పాలు పోసే ప్రతి పాడి రైతుకు లీటర్ కు రూ. 4 బోనస్.
- వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ టాక్స్ రద్దు చేస్తాం, టోల్ టాక్స్ రద్దు చేస్తాం.
- ప్రమాదవశాత్తూ లేదా ఆత్మహత్య చేసుకుని చనిపోయిన రైతు కుటుంబానికి వైఎస్సార్ బీమా ద్వారా రూ.7 లక్షలు ఇస్తాం. అంతే కాదు ఆ డబ్బును అప్పులవాళ్ళకు చెందకుండా అసెంబ్లీలో చట్టాన్ని తీసుకువచ్చి ఆ రైతు కుటుంబానికి అందగా ఉంటాం.
సమస్యల పరిష్కారం కొరకు టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించండి : 1902
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ సెషన్ ద్వారా మాకు తెలియజేయండి.
Leave a Reply