ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చారు. వైయస్సార్ రైతు భరోసా సంబంధించిన డబ్బులు రిలీజ్ చేయబోతున్నారు, కానీ చాలామందికి వైయస్సార్ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే ఈసారి పడవు. ఎందుకంటే కొన్ని కొత్త మార్పులు అయితే చేశారు. ఆ మార్పులు ఏంటి మరియు మీ యొక్క అకౌంట్లో ఈ రైతు భరోసా డబ్బులు పడతాయా లేవా అనే విషయాలన్నీ తెలుసుకుందాం.
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతుకి వైయస్సార్ రైతు భరోసా పథకం ద్వారా సంవత్సరానికి 13,500 రూపాయలను నేరుగా వారి బ్యాంకు ఖాతాలలోకి విడుదల వారీగా అయితే వేస్తున్నారు. అందులో భాగంగానే ఈసారి మనకు వైఎస్ఆర్ రైతు భరోసా కి సంబంధించిన రెండు వేల రూపాయలు, అలాగే పీఎం కిసాన్ కి సంబంధించిన మరొక రెండు వేల రూపాయలు మొత్తం మీద నాలుగు వేల రూపాయలు రేపటి నుండి అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతు బ్యాంకు ఖాతాలోకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతోంది.
ఈ డబ్బులని మీరు పొందాలంటే కచ్చితంగా ఈ కేవైసీ పూర్తి చేసి ఉండాలి. అలాకాకుండా ఈ కేవైసీ లేనివారికి లేదా బ్యాంక్ అకౌంట్ తో ఆధార్ అనుసంధానం చేయని వారికి ఈ పథకానికి సంబంధించిన నిధులు అయితే విడుదల చేయమని కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా స్పష్టం చేసి చెప్పింది.
ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది ఎందుకంటే దాదాపు మన యొక్క దేశవ్యాప్తంగా 80 వేల మందిని పిఎం కిసాన్ అనరులని గుర్తించింది వీరందరికీ కూడా ఈసారి ఈ పథకానికి సంబంధించి ఎటువంటి డబ్బులు అయితే మంజూరు చేయరు అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసి తెలిపింది.
కాబట్టి ఇప్పటికే ఎవరైనా ఈ కేవైసీ పెండింగ్లో ఉన్నవారు మీరు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ekyc అనేది పూర్తి చేయండి. మనకు రేపటినుండి అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతు అకౌంట్లో 4000 రూపాయలు అంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 2000 రూపాయలు మరియు కేంద్ర ప్రభుత్వం నుండి 2000 రూపాయలు అయితే అకౌంట్ లలో పడబోతున్నాయండి.
ఫ్రెండ్స్ ఇదే ఇప్పుడు ఇప్పుడు వచ్చిన అప్డేట్ రైతుల గురించి.