హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు navaratnalu.com రాష్ట్ర ప్రభుత్వం వైయస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ రెండవ దశ Update అయితే ఇచ్చింది ఆ వివరాలన్నీ ఈ వెబ్ పేజీలో తెలుపబడినవి పూర్తిగా చదివి ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి.
వైఎస్ఆర్ సంచార ఆరోగ్య సేవ – పశువులకు అంబులెన్స్ సేవలు మరింత విస్తృతం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నేడు రెండవ దశలో రూ.111.62 కోట్ల వ్యయంతో మరో 165 వాహనాలను సీఎం క్యాంపు కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించనున్న గౌః ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు. ఇప్పటికే మొదటి దశలో రూ.129.07 కోట్ల వ్యయంతో 175 పశువుల అంబులెన్స్ ల ద్వారా 181791 పశువులకు ప్రాణం నుంచి రక్షించి 126559 మంది పశువులకు లబ్ధి చేకూరింది.
గమనిక: రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు 25 జనవరి, 2023 ఉదయం గం॥10 లకు సి.ఎం. క్యాంపు కార్యాలయం వద్ద”డాక్టర్ వైయస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ” పశువుల అంబులెన్స్ లను జెండా ఊపి ప్రారంభిస్తారు ఈ కార్యక్రమాన్ని అన్ని ప్రముఖ న్యూస్ ఛానల్ లైవ్ లో వీక్షించవచ్చు
YSR Sanchara Pashu Arogya Seva Toll Free Number : 1962
మూగజీవాలు తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు – పౌర సంబంధాల శాఖ ఆంధ్ర ప్రదేశ్ (Civil Relations Department Andhra Pradesh) టోల్ ఫ్రీ నెంబర్ 1962 కు ఫోన్ చేసి పాడి రైతు పేరు, గ్రామం, మండలం, పశువుల ఆరోగ్య సమస్య వివరించిన వెంటనే సంబంధిత రైతు భరోసా కేంద్రానికి సమాచారం చేరుతుంది. ఆ వెంటనే పశువుల అంబులెన్సులు పశువు ఉన్న ప్రాంతానికి వెళ్లి పశువు వైద్య సేవలు అందిస్తాయి.
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే, క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.
Leave a Reply